తెలంగాణ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టీచర్ పోస్టులకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే!
నల్గొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, పీజీటీ, టీజీటీ విభాగాల్లో మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 22 న సాయంత్రం 5 గంటల వరకు నల్గొండలోని మహిళా సమాఖ్య భవన్లో ఉన్న ప్రాంతీయ సమన్వయాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
