తెలంగాణ
Nalgonda: మున్సిపల్ కార్పొరేషన్ లో బోగస్ ఉద్యోగుల దందా.. బినామీల పేరిట జీతాలు డ్రా!!..
రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైనా అవినీతికి మాత్రం అంతం ఉండటం లేదు. ఒకవైపు లంచాల భూతం పట్టిపీడిస్తుండగా.. మరోవైపు ప్రతి శాఖలో రోజుకో కొత్త కుంభకోణం భయటపడటం చర్చంశనీయంగా మారుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కుంభకోణాలకు నిలయం అనే ఆరోపణలున్నాయి. కానీ బీఆర్ఎస్ అవినీతిపై రేవంత్ రెడ్డి చేసిన పోరాటంతో ప్రజల్లో నెలకొన్న ఆశ.. మళ్ళీ కాంగ్రెస్ కు పునరుజ్జీవం ఇచ్చింది..
అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక రాష్ట్రంలో ప్రతి శాఖలో తవ్వుతున్న కొద్ది అవినీతి లుకలుకలు బయటపడటం.. మళ్ళీ కాంగ్రెస్ పాలనపై గతం తాలూకు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
