International
Nagaland: మద్య నిషేధం ఉన్న చోట కల్తీ మద్యం కలకలం.. 19మంది బలి!
పూర్తి మద్యనిషేధం అమల్లో ఉన్న నాగాలాండ్ ట్యూన్ సాంగ్ జిల్లాలో కల్తీ మద్యం తీవ్ర విషాదాన్ని నింపింది. అనుమానాస్పద స్థితిలో కల్తీ మద్యం సేవించి గడిచిన రెండు రోజుల్లోనే ఏకంగా 19 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. రాష్ట్రంలోని మొకోక్‌చుంగ్ జిల్లాలో 8మంది, ట్యూన్‌సాంగ్ జిల్లాలో 11 మంది మృతి చెందినట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. ఈ హృదయవిదారక ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురికాగా, పోలీసు యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది.
