సినిమా

Naga Chaithanya: బ్లాక్ బస్టర్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్?

Naga Chaithanya: నాగ చైతన్య ఇప్పుడు తన 25వ సినిమాను వెంకీ అట్లూరో చేయడానికి ఆసక్తిగా ఉన్నాడట. తన ల్యాండ్ మార్క్ మూవీకి బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. చైతూ కూడా లవ్ స్టోరీ, తండేల్ సినిమాలతో వరుస హిట్స్ అందుకొని మంచి ఫాంలో ఉన్నాడు. తనకి కూడా ల్యాండ్ మార్క్ మూవీ చాలా ప్రత్యేకం. అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వృష కర్మ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.