క్రైమ్
వీడిన నల్గొండ జంట హత్యల కేసు మిస్టరీ.. మర్డర్స్ వెనుక కన్నింగ్ ‘ఖాకీ’..!
ఉమ్మడి నల్గొండ జిల్లా మోతె మండంలో జంటహత్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. బుధవారం రోజున ఈ హత్యా ఉదంతం వెలుగుచూడగా.. సూర్యాపేట పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. కేవలం రెండు రోజుల్లోనే ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. జంటహత్యల కేసు వెనుక ఉన్నది ఓ కానిస్టేబుల్ అని తేల్చారు. వివాహేతర సంబంధం, డబ్బుల విషయంలో గొడవనే హత్యకు దారితీసిందని సమాచారం. బీక్యా తండాకు చెందిన హలావత్ నాగు(50), భూబా(40) దంపతులు రెండేండ్ల కిందట పొట్టకూటి కోసం మోతె మండల కేంద్రానికి వలసొచ్చారు. బొక్క అమృత రెడ్డికి చెందిన కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా.. మంగళవారం అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని దుండగుల దాడిలో దంపతుల మరణించారు.
