వైరల్ న్యూస్

నా ఫోన్ దొంగిలించి వీడియోలు వైరల్ చేశారు : ఫోక్ యాక్టర్ మాధురి రాథోడ్

ప్రముఖ జానపద కళాకారిణి మాధురి రాథోడ్ విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 19న మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి ఇద్దరూ ఓకే రూంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన విషయం తెలిసిందే. ఈశ్వర్ సాయి భార్య వీరిని పట్టుకోవడం, దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే,ఆ సమయంలో ఈశ్వర్ సాయి భార్య తనను ఇష్టాను సారంగా దూషించడంతో పాటు తన ఫోన్‌ను దొంగిలిచిందని, అందులోని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేసిందని వేములవాడ పీఎస్‌లో మాధురి ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పలు కీలక అంశాలను చేర్చినట్టు తెలిసింది. ఈ నెల 19న రెడ్డి భవన్‌లో ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనను అసభ్య పదజాలంతో దూషించి దాడి చేసిందని మాధురి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటన సమయంలో సుమారు రూ.50 వేల విలువైన తన ఐఫోన్‌ను కూడా తీసుకెళ్లారని ఆరోపించారు.