తెలంగాణ

బినామీలు, స్కాములపై సమాధానం చెప్పలేకే నా అరెస్టు : మన్నెక్రిశాంక్

బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. ఇటీవల ఆయన సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల మీద అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం క్రిశాంక్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు సికింద్రాబాద్ కోర్టుకు తరలించారు. అయితే, మన్నె క్రిశాంక్ అరెస్టుపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి కుటుంబం చేసిన రూ.50వేల కోట్ల అవినీతి సామ్రాజ్యం మీద ప్రెస్‌మీట్ పెడితే అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించడంతో పాటు వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే కోర్టు వద్దకు భారీ ఎత్తున నాయకులు,కార్యకర్తలు చేరుకుంటున్నారు.అయితే, గాంధీ హాస్పిటల్ ప్రాంగణంలో క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు. ‘నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేకే అరెస్ట్ చేశారు.