తెలంగాణ

మూసీ పేరుతో మెగా లూటీ.. 30శాతం కమీషన్ కోసమే రేవంత్ ఆరాటం

Musi: రాష్ట్రంలో తీవ్ర కరువు కాటకాలు విలయతాండవం చేస్తుంటే.. ప్రజలు తాగునీరు, సాగునీరు లేక అల్లాడిపోతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం వేల కోట్ల రూపాయలతో 'మూసీ సుందరీకరణ' పేరుతో మరో మెగా దోపిడీకి తెరలేపిందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. కనీసం డీపీఆర్ లేకుండా, ఎలాంటి పారదర్శకత లేకుండా, నిబంధనలను గాలికొదిలేసి ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) ద్వారా రూ. 7,345 కోట్ల అప్పు తెచ్చి గ్లోబల్ టెండర్లు పిలవడం పాలకుల దివాలాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. మూసీ రివైవ్‌మెంట్‌పై రేవంత్ రెడ్డి ప్రభుత్వ మోసపూరిత వైఖరి, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు దాసోజు శ్రవణ్. మూసీ టెండర్ల ముసుగులో.. రూ.7,300 కోట్ల పనుల్లో.. 30 శాతం కమీషన్ కోసమే రేవంత్ రెడ్డి ఆరాటం అని ధ్వజమెత్తారు.