క్రైమ్
Murder case: హత్యాయత్నం కేసు.. బండి సంజయ్ ముఖ్య అనుచరుడి అరెస్ట్!
కరీంనగర్లో ఘోర ఉదంతం వెలుగు చూసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అనుచరుడు, 29వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్తో పాటు అతని అనుచరులు తీవ్రమైన హత్యాయత్నం కేసులో చిక్కుకున్నారు. కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్ ప్రాంతంలో నివాసముంటున్న శ్రీకాంత్ అనే యువకుడితో పాటు అతని సోదరుడిపై కార్పొరేటర్ , అతని వర్గీయులు దారణంగా కత్తులు, బీర్ సీసాలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో శ్రీకాంత్ కడుపులో బీర్ సీసాతో తీవ్రంగా పొడిచి, దాడికి పాల్పడిన రౌడీ మూక అక్కడి నుంచి పరారైంది.
