TG: ‘మురాసు’ తుపాను ఎఫెక్ట్.. తెలంగాణకు రెడ్ అలర్ట్!
TG: బంగాళాఖాతంలో దూసుకొస్తున్న ‘మురాసు’ తుపాను ప్రభావంతో తెలంగాణపై వరుణుడు పంజా విసరనున్నాడు. రానున్న మూడు నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.ఈ తుపాను ప్రభావం నవంబర్ 3న పీక్ స్టేజ్‌కు చేరనుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు ముంచెత్తే అవకాశముండటంతో ఈ జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ ప్రకటించారు. ఇదే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో ‘ఆరెంజ్ అలర్ట్’ ఇచ్చారు. సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, జనగాం, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడనున్నాయి.
