National

ముంబయి ట్రాఫిక్ పై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు!!..

ముంబయి ట్రాఫిక్‌.. చివరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా ఇబ్బంది పెట్టింది. వర్లీ నుంచి బయల్దేరిన గడ్కరీ.. ట్రాఫిక్‌లో చిక్కుకుని కార్యక్రమానికి గంట ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో ముంబయి రోడ్ల పరిస్థితిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఫ్లైఓవర్లు, మౌలిక వసతులు.. పెరుగుతున్న వాహన రద్దీకి సరిపోవడం లేదన్నారు. పాత ఫ్లైఓవర్ల స్థానంలో ఆధునిక సాంకేతికతతో మల్టీ-లెవల్ నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. భవిష్యత్ నగరాలకు ఇదే పరిష్కారమని గడ్కరీ స్పష్టం చేశారు.