ఏపీ
రేపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. కానీ!
ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమైంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం రేపు (గురువారం) పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మురసు తుపాను నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాజా పరిస్థితులపై ఆరా తీశారు. తుపాన్ తీరం దాటడంతో చాలా చోట్ల వర్షాలు తగ్గాయని జిల్లా కలెక్టర్లు వివరించడంతో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధమయ్యారు.వర్షప్రభావం ఇంకా కొన్ని మండలాల్లో ఉన్నందున అవి మినహా మిగిలిన చోట్ల పోలింగ్ నిర్వహించేందుకు రెడీగా ఉండాలని ఆదేశించారు.
