తెలంగాణ

కొడుకు కోసం రంగంలోకి ఎంపీ లింగమనేని.. బెస్ట్ డీల్ ఆఫర్?

కారు యాక్సిడెంట్ చేసి ఓ ప్రాణం పోవడానికి కారకుడైన తన కొడుకును విడిపించేందుకు అతని తండ్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కొడుకు మీద అసలు కేసు లేకుండా చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తునట్టు టాక్ వినిపిస్తోంది. అందుకోసం ఏకంగా పోలీసులతో డీల్స్ మాట్లాడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ‘నా కొడుకుని కేసు నుంచి కాపాడితే ఎంతైనా ఇస్తా’ అని మాదాపూర్ పోలీసులకు జనసేన ఎంపీ లింగమనేని రమేష్ ఆఫర్లు ఇస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. స్టేషన్ ఉన్నతాధికారి, లింగమనేని కుటుంబానిది ఒకే సామాజికవర్గం కావడంతో స్టేషన్ బెయిల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 16వ తేదీన ఇనార్బిట్ మాల్ ఎదురుగా రోడ్డు దాటుతున్న లైఫ్‌స్టైల్ స్టోర్ ఉద్యోగి భారతి ముఖి (26) అనే యువతిని అతివేగంగా వచ్చి కారుతో ఢీకొట్టిన ఘటనలో లింగమనేని రమేష్ కొడుకు సంజుష్ నిందితుడిగా ఉన్నాడు.