National
బీజేపీ కుట్రపూరితంగా జ్ఞానేశ్ కుమార్ను సీఈసీగా నియమించింది
CEC Gyanesh Kumar: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ కుట్రపూరితంగా జ్ఞానేశ్ కుమార్ను సీఈసీగా నియమించిందని చామల కిరణ్ ఆరోపించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయనను ఆ పదవిలో కూర్చోబెట్టిందన్నారు.
