సినిమా

డబ్బు కంటే బాధ్యతే ముఖ్యం.. నైతిక విలువల కోసం భారీ ఆఫర్లను వ‌దులుకున్న‌ స్టార్లు!..

నేటి సమాజంలో నైతిక విలువలు అనేవి భూతద్దం పెట్టి వెతుక్కోవలసిన పరిస్థితులు నెలకొన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా గ్లామర్ ప్రపంచంలో కోట్లాది రూపాయ‌ల‌ రెమ్యునరేషన్- విపరీతమైన క్రేజ్ ఉన్న వారు సైతం విలువలను కాపాడుకుంటలేరనే ఆరోపణలున్నాయి. డబ్బు ఎవరికి ఊరికే రాదు.. కానీ డబ్బు సంపాదించే మార్గాలే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయని అంటారు..

అలాంటి వారు మన భారతీయ చిత్రపరిశ్రమలో చాలా అరుదుగా కనిపిస్తారనే టాక్ ఉంది. ముఖ్యంగా సమాజం విష‌యంలో బాధ్యతను, నైతిక విలువలను ప్ర‌ధానంగా భావించే కొందరు స్టార్లు కేవలం డబ్బు లేదా పబ్లిసిటీ కోసం కాకుండా తమ నిర్ణయం సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోన‌ని ఆలోచించి కొన్ని అవకాశాలను, ప్రకటనలను తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి.