క్రైమ్
ప్రియుడి కోసం తల్లి హత్య.. కొడుకుని వదిలి పరార్!
వివాహేతర సంబంధం ముసుగులో ఓ మహిళ దారి తప్పింది. తనకు జన్మనిచ్చిన తల్లి అని కూడా చూడకుండా అడ్డుతొలగించుకోవడానికి ప్రయత్నించింది.చివరకు ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టింది. తల్లిని అంతమొందించడంతో పాటు కన్న కొడుకును కూడా వదిలేసి పరార్ అయ్యింది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరు క్యాబిన్పేటలో చోటుచేసుకోగా ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. కట్టుకున్న భర్త మరణించడంతో కుమారుడితో కలిసి తల్లి వద్దే ఉంటున్న పుష్పలతకు.. రాజా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త కొంత కాలానికి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం కాస్త పుష్పలత తల్లి లక్ష్మి (48) తెలియడంతో... అతనికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. అయితే, తమ ఏకాంతానికి తల్లి లక్ష్మి అడ్డుగా ఉందని భావించిన పుష్పలత.. ప్రియుడితో కలిసి ఆమెను హత్య చేసింది.
