వైరల్ న్యూస్
హైదరాబాద్‌లో కొత్త సమస్య.. రాత్రి వేళల్లో భయాందోళనలో నగరవాసులు!
హైదరాబాద్ నగరంలో దోమల బెడద మునుపెన్నడూ చూడని రీతిలో కొత్త రూపం దాల్చింది. లంగర్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో వేలాది దోమలు ఒక్కచోట గుమిగూడి భూమి నుంచి ఆకాశం వైపు వలయాకారంలో సుడిగాలిలా (మస్కిటో టోర్నడో) ఎగురుతున్న వింత దృశ్యాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ అసాధారణ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. లంగర్‌హౌస్ మాత్రమే కాకుండా టోలిచౌకి, మెహదీపట్నం, గోల్కొండ, షేక్‌పేట్, జూబ్లీహిల్స్ వరకు ప్రధాన రహదారులపై దోమల గుంపులు భారీగా సంచరిస్తున్నాయి.
