Mohammed bin Salman: సౌదీకి క్షిపణి గండం.. కనిపించని మహమ్మద్ బిన్ సల్మాన్!
Mohammed bin Salman: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు రోజురోజుకూ మరింత దట్టంగా అలుముకుంటున్నాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, శక్తిమంతమైన రాజ్యాల్లో ఒకటైన సౌదీ అరేబియా రాజభవనాల్లో ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తత, అభద్రత నెలకొంది. యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ భూభాగంపై క్షిపణి దాడులను ముమ్మరం చేయడంతో సౌదీ యువరాజు, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఏ క్షణంలో ఎటువైపు నుంచి దాడి జరుగుతుందో తెలియని పరిస్థితుల నడుమ ఆయన రహస్య బంకర్లలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న వార్తలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి.గత వారం రోజులుగా మహమ్మద్ బిన్ సల్మాన్ బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. శత్రువుల నిఘా కన్ను పడకుండా ఉండేందుకు ఆయన కదలికలను భద్రతా విభాగం అత్యంత గోప్యంగా ఉంచుతోంది. అత్యున్నత శిక్షణ పొందిన ఎలైట్ కమాండోల భారీ భద్రతా వలయం నడుమ.. ఒక రహస్య బంకర్ నుంచి మరో సురక్షితమైన రాజభవనానికి ఆయనను నిరంతరం మారుస్తున్నారు.
