వైరల్ న్యూస్
నా జీవితాన్ని నరకంలా మార్చిన మోడీ.. ‘రుచిక’ మరో సంచలన వీడియో
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జెన్ జీ నిర్వహించిన నిరసనల్లో రుచిక అనే పదిహేనెళ్ల బాలిక పాల్గొన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ఆమె తీవ్ర విమర్శలు చేయడంతో పాటు దుర్భాషలాడారు.అయితే, నాటి నుంచికొందరు గూండాలు కాల్ చేసి బెదిరిస్తున్నారని వాపోయింది. ఇంటి ఓనర్స్కు సైతం బెదిరింపులు రావడంతో వారు తమను ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా మరో వీడియో విడుదల చేసిన రుచిక.. మోడీ తన జీవితాన్ని నరకప్రాయంగా మార్చేశారని ఆరోపించింది. తనకు ఇంకా ఇబ్బంది పెడుతున్నారని వాపోయింది. ‘మోడీ ఓ పిరికివాడు.. నా జీవితాన్ని నరకంలా మార్చేశారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మోడీ తనను ఎంతలా హింసించారంటే సర్వస్వం కోల్పోయా అంటూ రుచిక ఆవేదన వ్యక్తం చేసింది.
