దునియా

Modi - Jinping : ఇరుదేశాల ప్రయోజనాల కోసం కలిసి నడుద్దాం.. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీతో జిన్‌పింగ్ భేటీ!

Modi - Jinping : ప్రపంచ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తూ, భారత్ - చైనా సంబంధాలలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఢిల్లీ వేదికగా జరుగుతోన్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీ అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. గత కొన్నేళ్లుగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం కొనసాగుతున్న తరుణంలో.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్వయంగా భారత్‌తో కలిసి నడవాలంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్‌ను షేక్ చేస్తున్నాయి.కేవలం మాటలకే పరిమితం కాకుండా, భారత్‌తో దీర్ఘకాలిక, వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా అధ్యక్షుడు ప్రకటించడం అత్యంత కీలక పరిణామం. ప్రధానంగా ఇరు దేశాల మధ్య ప్రధాన సమస్యగా మారిన సరిహద్దు వివాదం, ద్వైపాక్షిక వాణిజ్య లోటు, టెక్నాలజీ రంగాల్లో సహకారం తదితర కీలక అంశాలపై మోడీ, జిన్‌పింగ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆసియాలోని రెండు అగ్రరాజ్యాలు చేతులు కలిపితే అంతర్జాతీయ వాణిజ్య ముఖచిత్రమే మారిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.