తెలంగాణ
తెలంగాణ భవన్‌లో 'మాక్ అసెంబ్లీ'.. సీఎంగా తలసాని.. స్పీకర్‌గా మాణిక్యరావు!
తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో శనివారం ఉదయం 'మాక్ అసెంబ్లీ' (నమూనా శాసనసభ) నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు.
