జంటపై ఓ గుంపు అమానుషం.. వేధింపులు, కిడ్నాప్‌నకు యత్నం!
బిహార్‌లో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ యువతి పట్ల కొందరు దుండగులు చాలా అమానుషంగా ప్రవర్తించారు. ఏకాంతంగా గడిపేందుకు ఓ జంట నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లగా వారిని గమనించిన ఓ గుంపు వెంటాడి వేధింపులకు గురిచేసింది. ఓ వైపు అబ్బాయిని పట్టుకుని వేధించడంతో పాటు యువతిని సైతం అసభ్యంగా తాకుతూ రాక్షస ఆనందాన్ని పొందారు.ఈ ఉదంతాన్ని ఆ గుంపులోని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఈ ఘటన బిహార్‌లోని జమూయిలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. నిర్మానుష్య ప్రాంతంలో ఏకాంతంగా ఉన్న జంటను టార్గెట్ చేసిన కొందరు దుండగులు.. వారిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు.యువతి పట్ల అత్యంత అమానుషంగా ఘోరంగా ప్రవర్తించారు.యువతిని అసభ్యకరంగా తాకుతూ తీవ్ర వేధింపులకు గురి చేశారు.ఓ వ్యక్తి ఆమె ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ ఎత్తుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. చివరికి కాళ్లావేళ్లా పడితే అప్పుడు ఆ ప్రేమజంటను దుండగులు వదిలేసినట్టు తెలిసింది.
