పీఎస్‌లో మా మాళ్లపై మూకదాడి.. వెల్ డన్ రాహుల్ గాంధీ : కేటీఆర్
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా స్పందించారు. తన పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేశ్ మీద జరిగిన దాడిని ఖండించిన ఆయన సోషల్ మీడియా‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. మూకదాడి ఎప్పుడూ హత్యగా ప్రారంభం కాదని, కొన్నిసార్లు అది పోలీస్‌స్టేషన్‌లో, యూనిఫాంలో ఉన్న అధికారుల సమక్షంలోనే ప్లాన్ చేసే దాడిగా మొదలవుతుందని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం రౌడీయిజానికి మద్దతు ఇస్తూ ప్రోత్సహిస్తున్న తీరును చూస్తుంటే అతి త్వరలోనే వీధుల్లో మూకదాడులు జరుగుతాయేమోనని ఆందోళనగా ఉందన్నారు. అసెంబ్లీ గేట్ నెంబర్ 3 వద్ద జరిగిన తోపులాట విషయమై విచారణ కోసం సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన తన పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌లపై మూకదాడి జరిగినట్టే, అణిచివేతకు లొంగని ఏ తెలంగాణ పౌరుడిపై అయినా జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
