ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కారుకు ఘోరప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం!
తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు పెను ప్రమాదం తప్పింది. ఆయన చేపట్టిన పాదయాత్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా అనాజీపురం చౌరస్తా వద్ద పాదయాత్ర తిరుమలగిరి వైపు కొనసాగుతుండగా ప్రమాదవశాత్తు మల్లన్న కారును లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. అనంతరం మల్లన్న కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టినట్టు సమాచారం. అయితే, మరో కారులో తిరుమలగిరికి చెందిన భార్యాభర్తలు మేడబోయిన సాయినాథ్, చందన ఉన్నారు. ప్రమాదంలో దంపతులు ఇద్దరూ తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.అయితే, వారి రెండేళ్ల కుమారుడు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన సమయంలో మల్లన్న కారులో లేరని తెలుస్తోంది. అయితే, మల్లన్న వాహనంలో ఉన్న డ్రైవర్ బన్నీ, ఆయన సన్నిహితుడు రంగన్నలకు తీవ్ర గాయాలవ్వగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
