తెలంగాణ
ఇంటర్ రద్దు.. కార్పొరేట్ విద్యా వ్యాపారం కోసమే..
రేవంత్ సర్కార్ తీసుకున్న ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ రద్దు నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా స్పందించారు. ఎలాంటి సంప్రదింపులు, శాసనసభ చర్చ, చట్ట సవరణ లేకుండా కేవలం ఒక సమీక్షా సమావేశంలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేసే నిర్ణయం తెలంగాణ బిడ్డల కోసం కాదని, కార్పొరేట్ విద్యాసంస్థల స్వార్థ ప్రయోజనాల కోసమేనని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. నవంబర్ 11న ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన సమీక్షలో ఇచ్చిన ఆదేశాన్ని తక్షణమే నిలిపివేసి, ఈ అంశాన్ని శాసనసభ ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.
