ప్రభుత్వ హెలికాప్టర్లో ఎమ్మెల్యే భర్త షికార్లు.. పైసలెవరిస్తరు?
రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరగడంతో సామాన్యులు, దిగువ మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరలు పెరగకుండా కట్టడి చేయడంలో విఫలమైన రేవంత్ సర్కార్.. కాంగ్రెస్ పార్టీ నేతల జల్సాలను మాత్రం తెగ ఎంకరేజ్ చేస్తున్నదని ఆరోపణలు ఉన్నాయి.సాధారణంగా ప్రభుత్వ హెలికాప్టర్‌ను కేవలం ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయి వ్యక్తులు మాత్రమే ఉపయోగించాలి. అందుకు ప్రభుత్వం రూ.కోట్లలో అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే, తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా సీఎం రేవంత్ రెడ్డి కంటే అధికంగా మంత్రులే హెలికాప్టర్లో చక్కర్లు కొడుతున్నారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కాకుండా ఓ ఎమ్మెల్యే భర్త హెలికాప్టర్లో అది కూడా ప్రభుత్వ ఖర్చుతో సంచరించడం హాట్ టాపిక్ అయ్యింది. సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయి భర్త దయానంద్ ప్రభుత్వ హెలికాప్టర్లో షికార్లు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
