తెలంగాణ
ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్ గెలుస్తుందనే..దానం సుప్రీంకోర్టుకెళ్లారు
Padi Kaushik Reddy: ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ అనర్హతను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. పార్టీ ఫిరాయింపుల కేసులో దానంపై హైకోర్టు ఇచ్చిన అనర్హత వేటు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దానం నాగేందర్ పై సుప్రీంకోర్టు తీర్పును ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. సుప్రీంకోర్టు తీర్పు ఫిరాయింపు రాజకీయాలు చేస్తున్న పార్టీలకు చెంపపెట్టు అని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
