తెలంగాణ
Mla Mallareddy: పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం.. మల్లారెడ్డి క్లారిటీ!
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ఊహాగానాలకు స్వయంగా తెరదించారు. గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో తాను వేరే పార్టీలో చేరబోతున్నానంటూ జోరుగా ప్రచారం సాగుతుండటంతో మల్లారెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఆయన, తన పార్టీ మార్పుపై వస్తున్న వార్తలన్నీ కేవలం నిరాధారమైనవని, అవన్నీ అబద్ధాలంటూ కొట్టిపారేశారు.
