తెలంగాణ
తెలంగాణ మొత్తాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించాలి
Elnino: ఎల్ నినో పరిస్థితుల కారణంగా తెలంగాణ మొత్తాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కరువును కొన్ని మండలాలకే పరిమితం చేయడం కరెక్ట్ కాదన్నారు. క్షేత్రస్థాయిలో కరువు పరిస్థితిని పరిశీలించేందుకు నవంబర్ 3,4 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో పర్యటిస్తామన్నారు. అదే సమయంలో రాజకీయ పార్టీలకు హితబోధ చేశారు కూనంనేని సాంబశివరావు. ఎల్ నినో పరిస్థితులతో కరువు విలయ తాండవం చేస్తోందన్నారు. కరువు అనేది ప్రపంచవ్యాప్తంగా సంభవించిందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంపై రాజకీయంగా ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడం మాని.. ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో ఆలోచన చేయాలని రాజకీయ పార్టీలకు సూచించారు.
