తెలంగాణ

క్షమాపణ చెప్పించి ఉంటే కేసీఆర్ హుందాతనం పెరిగేది

Kunamneni: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. స్పీకర్ పై తాతా మధు వాడిన భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. వ్యక్తిత్వ హననం చాలా దురదృష్టకరమన్నారు. నిన్నటి ఘటన తనకు బాధ కలిగించిందన్నారు. స్పీకర్ కన్నీళ్లు పెట్టుకోవడం కలచివేసిందన్నారు కూనంనేని సాంబశివరావు. ఎంత కోపం ఉన్నా అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు లాంటి వాళ్లు చొక్కా విప్పడం సరికాదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలను ఖండిస్తూ అసెంబ్లీలో జరిగిన చర్చలో కూనంనేని మాట్లాడారు.