తెలంగాణ

ప్రభుత్వం సీమాంధ్ర నేతల చెప్పు చేతల్లో ఉండొద్దు

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ మాత్రం తగ్గడం లేదు. సొంత పార్టీ నేతలు, ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా పార్టీ నాయకులను, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్ర నేతల చెప్పుచేతల్లో ఉండొద్దని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి ఆధిపత్యం ఉండొద్దని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్ల కోసం కాదు.. పేదల కోసం ప్రభుత్వం పని చేయాలని హితవు పలికారు.