తెలంగాణ
రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం.. కోపం వస్తే..
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎవరికీ వ్యతిరేకంగా మాటాడలేదన్నారు. అవినీతి పైనే మాట్లాడారని చెప్పారు. పార్టీ బాగుండాలన్నదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాపత్రయం అని అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజగోపాల్ రెడ్డి ఒక అగ్నిపర్వతం లాంటి వారని, ఆయనకు కోపం వస్తే అగ్నిపర్వతంలా బరస్ట్ అవుతారని అన్నారు.
