తెలంగాణ

TG: మియాపూర్ భూములను కాపాడింది జర్నలిస్టులే.. మీడియాది అలుపెరగని పోరాటం..!

TG: హైదరాబాద్ మహానగరంలో ఒక్క గజం భూమి ధర ఆకాశాన్ని తాకుతున్న వేళ.. వేల ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడటం అంటే ఏకంగా అధికార పీఠంతోనే ఢీకొట్టడం. మియాపూర్ భూముల వ్యవహారంలో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు రాగానే మొత్తం ఘనత అంతా తమ ఖాతాలోనే వేసుకునేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి సిద్ధపడవచ్చు. కానీ, చరిత్రను ఒక్కసారి తిరగేస్తే అసలు సత్యం కళ్లముందు కదలాడుతుంది. నాడు అధికార బలంతో వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకున్న బీఆర్ఎస్ హయాంలో.. ప్రాణాలకు తెగించి ఆ భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేసింది అప్పటి మీడియా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు మాత్రమే.