క్రైమ్

మైనర్ డ్రైవింగ్.. రెండు కార్ల మధ్య ఇరుకున్న స్కూటీ..!

మైనర్ బాలురు స్కూటీని రోడ్డు మీదకు తీసుకుని రావడం, వారి డ్రైవింగ్ మూలనా రెండు కార్లు ఢీకొన్నాయి. ఫలితంగా ఇద్దరు బాలురు రెండు కార్ల మధ్య ఇరుక్కున్న ఘటనలో ఒకరు మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. కామారెడ్డి పాత జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కార్ల మధ్య స్కూటీ ఇరుక్కుపోయింది. ఆ సమయంలో మైనర్ వాహనం నడిపినట్టు తెలుస్తోంది. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు బాలురు 9వ తరగతి చదువుతున్న లోకేశ్, హేమంత్‌గా గుర్తించారు. వీరిద్దరూ ప్రాణ స్నేహితులుగా తెలిసింది. అయితే, ఈ ప్రమాదంలో హేమంత్ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. లోకేష్‌కు తీవ్ర గాయాలు అవ్వగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింది.