తెలంగాణ
కరువును ఎదుర్కొనేందుకు అఖిలపక్షం సూచనల మేరకు చర్యలు- మంత్రి ఉత్తమ్
Elnino: కరువు పరిస్థితులను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూల, నిర్మాణాత్మక దృక్పథంతో ముందుకు సాగుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అంతర్రాష్ట్ర నదీ జలాల అంశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, రాష్ట్ర రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అఖిలపక్ష సమావేశంలో నిర్వహించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు, ఎల్‌నినో నోడల్ అధికారి రామకృష్ణారావు హాజరయ్యారు.
