తెలంగాణ
ఒకే పంటపై ఆధారపడొద్దు- రైతులకు మంత్రి తుమ్మల కీలక సూచన
Telangana: తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు కీలక సూచన చేశారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులు ఒకే పంటపై ఆధారపడొద్దని మంత్రి సూచించారు. పంటల వైవిధ్యంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాలన్నారు. పాడి పరిశ్రమ, చేపల పెంపకం, కోళ్ల పెంపకం వంటి రంగాలను వ్యవసాయంతో అనుసంధానం చేసుకుంటే ప్రతిరోజు ఆదాయం పొందవచ్చన్నారు. రైతు నేస్తం 113వ ఎపిసోడ్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని సూచించారు.
