తెలంగాణ

రైతుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం.. సమగ్ర విత్తన చట్టం తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం

Tummala Nageswara Rao: తెలంగాణ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సమగ్ర విత్తన చట్టాన్ని తీసుకురావడంలో ఇక ఎలాంటి జాప్యం ఉండకూడదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వచ్చే పంట కాలానికైనా రైతులకు మేలు జరిగేలా విత్తన చట్టాన్ని అమల్లోకి తెచ్చే తదుపరి చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విత్తన చట్టం-2025పై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విత్తన ఉత్పత్తి, నాణ్యత, నియంత్రణ, విక్రయాలు, ధరల నియంత్రణతో పాటు విత్తన ఉత్పత్తి రైతుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.