తెలంగాణ
ప్రభుత్వం క్రాప్ హాలిడేపై మంత్రి తుమ్మల క్లారిటీ
ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. అది పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ప్రభుత్వం ఎలాంటి క్రాప్ హాలిడేను ప్రకటించలేదన్నారు. ప్రస్తుతం ఎల్ నినో తీవ్రంగా ఉందని దానిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తున్నామని, ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను సబ్సిడీలో అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
