చిత్రం లేదు
తెలంగాణ

minister seethakka: వీబీ-జీ రామ్ జీ అమలుపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు!

తెలంగాణలో గ్రామీణ ఉపాధి హామీ పథకం (వీబీ-జీ రామ్ జీ - VB-G RAM G) అమలే లక్ష్యంగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క బుధవారం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఉపాధి పనుల పురోగతి, కూలీలకు పనుల కల్పన, ఎదురవుతున్న సాంకేతిక సమస్యలపై హైదరాబాద్ నుంచి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో 12 వేల మందికి పైగా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఉపాధి పనుల ఎంపిక, ఆమోదంలో గ్రామసభల నిర్ణయాలకే అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు.