తెలంగాణ

కొండా సురేఖకు మంత్రి సీతక్క కౌంటర్

మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క తాజాగా కౌంటర్ ఇచ్చారు. తన మంత్రి పదవి పోవడానికి సీఎం రేవంత్ రెడ్డి, మరి కొందరు కుట్ర చేశారని, హైకమాండ్‌ను ముఖ్యమంత్రి బ్లాక్ మెయిల్ చేశారని కొండా సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌పై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. బ్లాక్ మెయిల్‌కు భయపడేంత బలహీనంగా అధిష్టానం లేదని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టంచేశారు. ఆదివారం ఉదయం మీడియాతో సీతక్క మాట్లాడుతూ.. ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాల్సిందేనని నొక్కిచెప్పారు. పార్టీ నిర్ణయాల విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని వెల్లడించారు.