స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
Minister PRO: ఆ మంత్రి పీఆర్వో రూటే సపరేట్ ?
ఆయన ఉత్తర తెలంగాణలో జూనియర్ మంత్రిగా చూస్తారు. గతంలో ఆయన వద్దకు ఓ సీనియర్ మంత్రి చెప్పితే ఓ కీలక పోస్టుకు ఓకే చెప్పారు. జూనియర్ మంత్రి పేషీలో సీనియర్ మంత్రి నిఘా అంటూ స్వేచ్ఛ న్యూస్ కథనాలు వ్రాయడంతో పోస్టింగ్ ఆగిపోయింది. సోషల్ వెల్ఫేర్ డిపార్మెంట్ నుంచి వచ్చిన ఆ పీఆర్వో తీరు మంత్రి వద్ద అందరినీ కలవర పెట్టిస్తుంది. ఈయన ఎక్కడ జర్నలిస్టుగా పని చేయలేదు. ఒక్క ప్రెస్ నోట్ కూడా సరిగ్గా రాయడం రాదు. ఔట్ సోర్స్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యారు. ఓ ఐఎఎస్ అధికారి ఢిల్లీకి వెళ్తుండగా ఈ మంత్రి వద్దకు పంపించారు. దీంతో ఈయన ఇక్కడ పీఆర్వో ఉద్యోగం కాకుండా అన్ని పనులు చక్కబెడుతున్నారని తెలుస్తోంది.
