తెలంగాణ

బీసీలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోదు-మంత్రి పొన్నం

BC Lands: బీసీలకు కేటాయించిన భూములపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో బీసీలకు కేటాయించిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి ఉండదని ఆయన తేల్చి చెప్పారు. బీసీలకు కేటాయించిన భూములు వెనక్కి తీసుకుంటారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. బీసీలకు కేటాయించిన భూముల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీలకు కేటాయించిన భూముల్లో భవనాలు నిర్మించడమే ప్రభుత్వ సంకల్పం అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కుల సంఘాల ప్రతినిధులు అంతర్గత విభేదాలకు తావునివ్వకుండా ఐక్యంగా ఉండి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు.

38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ విడుదల చేసిన జీవో పత్రాలను కుల సంఘాల ప్రతినిధులకు అందజేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, పలువురు నేతలు పాల్గొన్నారు.