తెలంగాణ
జగన్‌తో కుమ్మక్కు..! తెలంగాణలో కరవు పాపం కేసీఆర్‌దే!
Komatireddy Venkat Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో కరవు పాపం కేసీఆర్‌దే అని అన్నారు. ఏపీ మాజీ సీఎం జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కయ్యారని, అందుకే తెలంగాణకు రావాల్సిన నీటిని కోల్పోయామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. కేసీఆర్ చేసిన పనితో కష్ట కాలంలో శ్రీశైలం నుంచి నీటి తరలించే పరిస్థితి లేకుండా పోయిందని వాపోయారు.
