తెలంగాణ
10రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి-మంత్రి ఆదేశం
Komatireddy Venkat Reddy: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పక్కా ప్రణాళికతో 10 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. అవసరమైతే కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలని సూచించారు. ఎక్కడా జాప్యం జరగకుండా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు. రైతన్నలకు అండగా నిలవడమే మా లక్ష్యం అన్నారు మంత్రి కోమటిరెడ్డి. అలాగే కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వచ్చే సీజన్ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
