పీసీసీ విచారణకు మంత్రి దామోదర డుమ్మా!
కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య నెలకొన్న వివాదాలు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్నా వారి తీరులో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఎవరు ఏమనుకుంటే మాకేంది? అన్న ధోరణిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల రాహుల్ గాంధీ పిలుపుమేరకు రాష్ట్రం నుంచి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీలోని రాంలీలా మైదానంలో తలపెట్టిన ర్యాలీలో పాల్గొన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు మధ్య మాటల యుద్ధం నెలకొంది.డీసీసీ పదవుల నియామకంలో వీరిద్దరి మధ్య వివాదం తలెత్తినట్టు సమాచారం.ఈ క్రమంలోనే మంత్రి దామోదర ఢిల్లీలోని శాంగ్రిలా హోటల్ లాబీలోని గదిలో తీవ్ర అసభ్య పదజాలంతో లక్ష్మీకాంతరావును దూషించినట్టు తెలిసింది. అంతేకాకుండా ఇద్దరి మధ్య మాటలు ముదరడంతో వ్యక్తిగతంగా దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లినట్టు సమాచారం. ఆ సమయంలో మల్రెడ్డి రంగారెడ్డి,పలువురు నేతలు ఉన్నట్టు తెలిసింది.
