పాతబస్తీలో ఎంఐఎం అరాచకాలు.. మహిళా బీఎల్వోపై దాడి
ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఎస్ఐఆర్ లిస్టులో పేరు లేనివారికి, తప్పులు ఉన్నవారికి ఈసీ నోటీసులు జారీ చేసింది. అందుకు సమాధానాలు ఇవ్వాలని ఓటర్లను కోరింది. అయితే, ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి సుమారు కోటి ఓట్లు పోతాయని తెలుస్తోంది. ఇటీవల ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఇప్పటికే 70 లక్షలకుపైగా ఓట్లు గల్లంతు అవ్వగా.. మరో 25 లక్షల మంది నుంచి ఎస్ఐఆర్ ఫామ్స్ తిరిగి రాలేదని సమాచారం. ఇదిలాఉండగా, పాతబస్తీలో ఎంఐఎం నేతలు ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. బీఎల్వో అధికారుల మీద దాడులకు పాల్పడుతున్నట్టు వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా పాతబస్తీలో ఓ మహిళా బీఎల్ఓ (బూత్ లెవల్ ఆఫీసర్)పై దాడి జరిగింది. ఎంఐఎం పార్టీ నేత హసన్ మహిళా అధికారిణిపై దాడి చేసి చంపుతానని బెదిరించినట్టు తెలిసింది. దీంతో బాధితులురాలు ఐఎస్ సదన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
