National

అఖిలేశ్ యాదవ్‌కు ఎంఐఎం చీఫ్ అసద్ ఓపెన్ ఆఫర్!

వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో పాటు సీఎం యోగి సర్కార్ కూడా యూపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన గెలుపు అవకాశాలపై ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం.మరోవైపు ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (Sp), బహుజన సమాజ్ వాదీ పార్టీ (BSP), ఇతర పార్టీలు సైతం రాబోయే యూపీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కులాల వారీగా స్ట్రాటజీలు ప్లే చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, యూపీలోని ప్రతిపక్ష పార్టీలకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. యూపీలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అఖిలేష్ యాదవ్‌, అక్కడి ప్రతిపక్ష పార్టీలకు పరోక్షంగా పొత్తు అంశంపై హింట్ ఇచ్చారు. యూపీలో బీజేపీ మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాము కోరుకోవడం లేదన్నారు.