Middle East: సౌదీ రక్షణకు ఈజిప్ట్ సైనిక కవచం.. చీలిపోతున్న అరబ్ ప్రపంచం?
Middle East: మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రాంతీయ ఆధిపత్య పోరు ఇప్పుడు ముస్లిం ప్రపంచాన్ని రెండు బలమైన శిబిరాలుగా చీల్చే ప్రమాదకర అంచుకు చేరింది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు సరిహద్దులు దాటి సౌదీ అరేబియా గుండెకాయపై బాంబులు కురిపిస్తుంటే, ఇస్లామిక్ ప్రపంచంలోనే అత్యంత బలమైన సైనిక శక్తిగా పేరున్న ఈజిప్ట్ రంగంలోకి దిగేందుకు సై అంటోంది. "సౌదీకి ఏ ఆపద వచ్చినా మా సైన్యాన్ని పంపిస్తాం" అని ఈజిప్ట్ అధ్యక్షుడు చేసిన ప్రకటన అరబ్ గడ్డపై సరికొత్త సైనిక సమీకరణాలకు తెరలేపింది. ఇది కేవలం సౌదీ భద్రతకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, అరబ్ ప్రపంచపు పట్టు కోసం సాగుతున్న అంతర్గత యుద్ధపు తీవ్రతకు నిదర్శనం.రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన ఆకస్మిక డ్రోన్ దాడి 13 మందిని బలిగొనడం, ఆ వెనుకే ప్రపంచ ఇంధన దిగ్గజం 'అరాంకో' ప్రధాన కార్యాలయంపై బాంబుల వర్షం కురవడం యావత్ గల్ఫ్ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
