International
కూలిన అమెరికా యుద్దవిమానం.. పైలట్ ఏం చేశాడంటే!..
అమెరికా అత్యాధునిక యుద్ధ విమానాల్లో ఒకటైన F-16 ఫైటింగ్ ఫాల్కన్ ప్రమాదానికి గురైంది. సెప్టెంబర్ 17న మిచిగాన్‌లోని గ్రాండ్ ట్రావర్స్ కౌంటీ సమీపంలో టెక్సాస్ ఎయిర్ నేషనల్ గార్డ్‌కు చెందిన F-16 శిక్షణ సమయంలో కూలిపోయింది. ఈ విమానం టెక్సాస్‌లోని 149వ ఫైటర్ వింగ్‌కు చెందినదిగా అధికారులు తెలిపారు. ఆల్పెనా కంబాట్ రెడీనెస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి సాధారణ శిక్షణ మిషన్‌లో భాగంగా విమానం ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.
