మాక్ అసెంబ్లీలో ‘కొండా ’ప్రస్తావన.. సీఎం ఏమన్నారంటే?
అసెంబ్లీ సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను ఈ సెషన్ నుంచి పూర్తిగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ గులాబీ ఎమ్మెల్యేలు వినూత్నంగా మాక్ అసెంబ్లీ నిర్వహించారు. శనివారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ భవన్లో నిర్వహించిన'మాక్ అసెంబ్లీ'కి హాజరయ్యారు. మాజీ మంత్రి,సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్ర పోషించగా, ఎమ్మెల్యే మాణిక్ రావు స్పీకర్గా పాత్రలో లీనమయ్యారు. మాక్ అసెంబ్లీలో సీఎం హోదాలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ‘కొండా సురేఖ బిడ్డ నాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఢిల్లీకి వెళ్లి మూడు రోజులు ఉండి తొక్కి వచ్చాను. ముఖ్యమంత్రినైన నాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బీసీ బిడ్డ అయిన కొండా సురేఖను బర్తరఫ్ చేయక ఏం చేయాలి? కేబినెట్లో వేరే వాళ్లు కూడా ఉన్నారుగా.. వాళ్ల గురించి కూడా మాట్లాడొచ్చుగా’ అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు.
